Farmer Suicide: హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం.. కౌలు రైతు బలవన్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2024-08-15 16:26:53  IST  )

పంట దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో చోటుచేసుకుంది.

Farmer Suicide: హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం.. కౌలు రైతు బలవన్మరణం
X

దిశ, కమలాపూర్: పంట దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొండం నరేందర్ రెడ్డి(56) గత మూడేళ్లుగా 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పంట రాబడి కోసం సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేయగా పంటలో నష్టం వాటిల్లింది. దీంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక నరేందర్‌ రెడ్డి నిత్యం మనోవేదనకు గురయ్యేవాడు. బుధవారం ఉదయం వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య నరేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం వరంగల్ ఎంజీయూ ఆసుపత్రికి తరలించగా.. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతం‌లో మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.

Next Story