electricity substation : కారేపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో పేలుడు..

by Batti.Sumithra |

కారేపల్లి క్రాస్‌ రోడ్‌ లోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో శుక్రవారం కేపాసిటర్‌ సెల్‌ పెద్దశబ్ధంతో పేలింది.

electricity substation : కారేపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో పేలుడు..
X

దిశ, కారేపల్లి : కారేపల్లి క్రాస్‌ రోడ్‌ లోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో శుక్రవారం కేపాసిటర్‌ సెల్‌ పెద్దశబ్ధంతో పేలింది. అతి వేడికి కెపాసిటర్‌ సెల్‌ పేలటంతో సబ్‌ స్టేషన్‌లో పొగతో కూడి మంటలు ఎగిసాయి. సబ్‌ స్టేషన్‌లో ఉన్న ఏఈ విజయ్‌కుమార్‌ వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. సబ్‌ స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. సబ్‌ స్టేషన్‌లో పెద్ద శబ్దం రావటం, పోగలు రావటంతో ఆప్రాంత వాసులు భయాందోళనకు గురైనారు. సకాలంలో స్పందించటంతో మంటలు పెద్దయంత్రాలకు పాకకుండా అడ్డుకోగల్గిగారు.

Next Story