- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chennai: చెన్నై నడిబొడ్డున దారుణం.. సూట్‌కేసులో యువతి మృతదేహం లభ్యం
by Kema Shiva Kumar |
సూట్‌కేసులో యువతి మృతదేహం లభ్యమైన ఘటన చెన్నై నగరం (Chennai City)లో గురువారం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సూట్‌కేసులో యువతి మృతదేహం లభ్యమైన ఘటన చెన్నై నగరం (Chennai City)లో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని తురైపాకం (Thuraipakam) ప్రాంతంలో రోడ్డు పక్కనే స్థానికులకు ఓ సూట్‌కేసు కనిపించింది. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి పోలీసులు సూట్‌కేసు ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అందులో ముక్కలుముక్కలుగా యువతి శరీర భాగాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ (CCTV footage) అధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. అనంతరం శరీర భాగాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






