Canada: కెనడాలో తీవ్ర విషాదం.. తెలుగు యువకుడి దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2024-09-16 09:23:32  IST  )

సరదాగా ఔటింగ్‌కు వెళ్లి ఓ తెలుగు యువకుడు దుర్మరణం పాలైన ఘటన కెనడా (Canada) దేశంలో చోటుచేసుకుంది.

Canada: కెనడాలో తీవ్ర విషాదం.. తెలుగు యువకుడి దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: సరదాగా ఔటింగ్‌కు వెళ్లి ఓ తెలుగు యువకుడు దుర్మరణం పాలైన ఘటన కెనడా (Canada) దేశంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)కు చెందిన ప్రణీత్ అనే యువకుడు ఎంఎస్ (MS) చేసేందుకు కెనడాకు వెళ్లాడు. అయితే ఈనెల 14న అతడి పుట్టిన రోజు కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్‌‌ ప్రాంతానికి ఔటింగ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే లేక్‌లో ఈత కొట్టేందుకు ప్రణీత్ (Praneeth) డైవ్ చేయగా.. ప్రమాదవశాత్తు నీట మునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, పుట్టిన రోజు నాడే కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వీలైనంత త్వరగా తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Next Story