Brutal Murder: హైదరాబాద్‌ నగరంలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2024-09-16 04:44:56  IST  )

ఓ నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైన విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

Brutal Murder: హైదరాబాద్‌ నగరంలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్/శేరిలింగంపల్లి: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ (Gachibowli Police Station) పరిధిలో నర్సింగ్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. జడ్చర్లకు చెందిన శృతి (23) గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్ హోటల్‌లో గత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గతంలో యశోద హాస్పిటల్‌లో ట్రైనీ నర్సుగా పనిచేసిన శృతి కొంతకాలం క్రితం జాబ్ మానేసి ఇంటికి వెళ్లింది. ఇటీవలే నగరానికి తిరిగివచ్చి జాబ్ సెర్చింగ్‌లో ఉన్నట్లుగా సమాచారం. అయితే గత రాత్రి చిన్న అంజయ్య నగర్ రెడ్‌స్టోన్ హోటల్ (Red Stone Hotel) ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది.

అయితే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం అది ముమ్మాటికీ హత్యేనని, రేప్ చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానాలను బలపరుస్తూ హోటల్ గదిలోని బెడ్ కింద మూడు బీర్ బాటిళ్లు, ఓ వాటర్ బాటిల్, చిప్స్ ప్యాకెట్ ఇతర వస్తువులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా గదిలో రక్తపు మరకలు కూడా ఉండడం ఆమెను రేప్ చేసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం డెడ్‌బాడీ (Dead Body) పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story