- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: చెన్నైలోని పుదుకోట్టైలో పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో నష్టం
by Kema Shiva Kumar |
చెన్నైలోని పుదుకోట్టైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలోని పుదుకోట్టైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. ముందుగా పట్టణంలోని ఓ జ్యువెలరీ షాపులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి పూట ప్రమాదం జరగడంతో ఆ మంటలు కాస్త పక్కనే ఉన్న బాణాసంచా షాపునకు అంటుకున్నాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున పేళ్లుల్లు సంభించించాయి. దీంతో ఆ పేలుడు ధాటికి భవనం కూడా పాక్షికంగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థాలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో రూ.కోట్లల్లో నష్టం వాటిల్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.
Next Story






