- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: హైదరాబాద్ మధురానగర్‌లో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దారుణ హత్య
by Kema Shiva Kumar |
హైదరాబాద్ నగర పరిధిలోని మధురానగర్‌లో దారుణం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర పరిధిలోని మధురానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రవికుమార్‌ను కొంతమంది దుండుగులు అతి కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చారు. అనంతరం పక్కనే ఓ పెద్ద బండరాయితో రవికుమార్ తలపై వేసి అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, హత్య చేసిన అనంతరం దుండగులు తమ జాడను జాగిలాలు పసిగట్టకుండా గదిలో మొత్తం కారంపొడి చల్లారు. అయితే, సాయంత్రం 4 గంటలకు బయటకు వెళ్లిన రవికుమార్ భార్య ఇంటికి వచ్చే చూసేసరికి భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






