- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG BREAKING: గంజాయితో పట్టుబడిన యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్
యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ గంజాయితో పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని సంపత్‌పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ప్లాట్‌కు వెళ్లారు. అయితే, తనిఖీల్లో ప్లాట్‌లో ఉన్న షణ్ముఖ్ వద్ద గంజాయి, డగ్స్ దొరికాయి. దీంతో అన్నదమ్ములను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
కాగా, గతంలో హిట్ అండ్ రన్ కేసులోనూ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ అయ్యాడు. అయితే అప్పుడు తను మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుంచి ఏలాగోలా బయటపడ్డాడు. యూట్యూబ్ వీడియోలతో సెలబ్రిటీగా మారాడు షణ్ముఖ్. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరిస్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ ఫేమ్‌తోనే అతడు బిగ్ బాస్-5లోకి ఎంటర్ అయ్యాడు.






