- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ASI Dead: నిజామాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం.. వ్యాయామం చేస్తూ ఏఎస్ఐ మృతి
by Kema Shiva Kumar |
ఓ ఏఎస్ఐ వ్యాయామం చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన విషాద ఘటన బుధవారం నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఓ ఏఎస్ఐ వ్యాయామం చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన విషాద ఘటన బుధవారం నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న దత్తాద్రి రోజులాగే ఇంట్లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను చికిత్స కోసం ప్రైవేట్ హాస్పటల్‌కు తరలించారు. దత్తా్ద్రిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నగరంలోని గాయత్రినగర్‌లో నివాసముంటున్న దత్తాద్రికి డిపార్ట్మెంట్లో మంచి పేరుందని తోటి సిబ్బంది తెలిపారు. అందరికీ తల్లో నాలుకలా ఉండే దత్తాద్రి వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోందని వారు అన్నారు.
Next Story






