- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివరాత్రి వేడుకల్లో అపశృతి – బాలిక దుర్మరణం
by Jakkula.Mamatha |
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడుకల్లో బాణాసంచా పేలడంతో 14 ఏళ్ల బాలిక మృతి చెందింది.

X
దిశ, ఏలూరు:పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడుకల్లో బాణాసంచా పేలడంతో 14 ఏళ్ల బాలిక మృతి చెందింది.తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం లోని శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠంలో శివరాత్రి రెండవ రోజు ఊరేగింపు లో బాణాసంచా కాలుస్తుండగా పైకి ఎగరవలసిన తారాజువ్వలు ఊరేగింపు చూస్తున్న పుష్ప (14) అనే బాలిక తలపై పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దేవరపల్లి మండలం త్యాజంపూడి కి చెందిన పుష్ప అదే మండలం ఎర్నగూడెం లో 9వ తరగతి చదువుతోంది. పుష్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఎస్ఐ సురేష్ దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






