- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident : టిప్పర్ ను ఢీకొట్టిన అంబులెన్స్…ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
అజాగ్రత్తతో టిప్పర్ నడిరోడ్డుపై నిలిపి ఉంచడం వల్ల వెనుక నుంచి వచ్చిన అంబులెన్స్ గట్టిగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా,

దిశ, మిర్యాలగూడ: అజాగ్రత్తతో టిప్పర్ నడిరోడ్డుపై నిలిపి ఉంచడం వల్ల వెనుక నుంచి వచ్చిన అంబులెన్స్ గట్టిగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం తెల్లవారుజామున మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన సునీత గత వారం రోజుల క్రితం నెల్లూరు బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో డయాలసిస్ కోసం చొక్కా శివకుమార్, సుబ్బమ్మ, కొండేటి సునీల్ తో కలిసి అంబులెన్స్ లో డ్రైవర్ తో పాటు మొత్తం ఐదుగురు నెల్లూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరారు.
కాగా మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలోకి రాగానే అజాగ్రత్తగా టిప్పర్ ను నడిరోడ్డుపై నిలిపి ఉంచడంతో అంబులెన్స్ వేగంగా వచ్చి టిప్పర్ వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో నెల్లూరుకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ మధ్యాహ్నం రాకేష్ (24) అక్కడికక్కడే మృతి చెందగా, డయాలసిస్ పేషెంట్ సునీత కు బలమైన గాయాలు కావడంతో హైదరాబాద్ కు తరలించి, మిగిలిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని బయటకు తీయడం కోసం జేసీబీ ని ఉపయోగించినట్లు స్థానికులు తెలిపారు.






