- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధతో మద్యానికి బానిసై...
by Sridhar Babu |
బాల్కొండలోని పోచమ్మ గల్లీకి చెందిన జెట్టి సాయిబాబు (48) అప్పుల బాధతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ బి.నరేష్ శనివారం తెలిపారు.

X
దిశ, బాల్కొండ : బాల్కొండలోని పోచమ్మ గల్లీకి చెందిన జెట్టి సాయిబాబు (48) అప్పుల బాధతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ బి.నరేష్ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సాయిబాబా డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 2021 సంవత్సరంలో తన కూతురి పెళ్లి చేయడంతో కొంత అప్పు అయింది. దాంతో మద్యానికి బానిసై తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. అదే విధంగా శుక్రవారం బాగా మద్యం తాగి వచ్చి అప్పుల విషయంలో కుటుంబ సభ్యులతో గొడవపడి వారిని బయటకు వెళ్లగొట్టి ఇంటి తలుపులు వేసుకున్నాడు. అనంతరం ఉరివేసుకొని మరణించాడు. మృతుని కుమారుడు జెట్టి సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- suicide
Next Story






