- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడి
కర్నూలు - హైదరాబాద్ జాతీయ రహదారి, పంచలింగాల ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై సోమవారం ఏసీపీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

X
దిశ, కర్నూల్ సిటీ ప్రతినిధి : కర్నూలు - హైదరాబాద్ జాతీయ రహదారి, పంచలింగాల ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై సోమవారం ఏసీపీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగాగా ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ.. స్పందన కార్యక్రమంలో చెక్‌పోస్ట్ కార్యాలయంపై అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు తెల్లవారుజామున 3 గంటలకు పంచలింగాల ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని తెలిపారు. తనిఖీల్లో చెక్‌పోస్ట్ అధికారులు మోటార్ వెహికిల్ ఇనిస్పెక్టర్ జె.సునీల్ కుమార్ వద్ద రూ.2,02,890 అక్రమంగా దాచి ఉంచిన డబ్బు గుర్తించామని తెలిపారు. తదుపరి విచారణ అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 14400 నెంబరుకు కాల్ చేయాలని పిలుపునిచ్చారు.
Next Story






