- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య నోట్లో గుడ్డలు కుక్కి.. కళ్ల ముందే భర్తను హత్య చేసిన దుండగులు
నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నోట్లో గుడ్డలు కుక్కి కళ్ల ఎదుటే భర్తను కొందరు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోనే కిరాతకంగా హత్య చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నోట్లో గుడ్డలు కుక్కి కళ్ల ఎదుటే భర్తను కొందరు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోనే కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొడుకును హత్య చేశారన్న సమాచారం విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






