- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
electric shock : విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..
by Batti.Sumithra |
కరెంటు షాక్ తో ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

X
దిశ, శేరిలింగంపల్లి : కరెంటు షాక్ తో ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రానికి చెందిన రాయబారపు ఉపేందర్ (26) రెండు నెలల క్రితం మియాపూర్ లోని బొమ్మరిల్లు రెస్టారెంట్ వెనుక నూతనంగా నిర్మిస్తున్న భవనానికి వాచ్మెన్ పని కోసం కుటుంబంతో కలిసి నగరానికి వచ్చాడు. ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి స్పృహ తప్పి పడి పోయాడు. వెంటనే గమనించిన భవన యజమాని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






