ఇదేం కసి.. ఇంటికి పిలిచి మర్మాంగం కట్ చేసిన మహిళ!

by Bhoopathi Nagaiah |

సహజంగా ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురిచేస్తేనో.. అత్యాచారయత్నం చేయబోతేనో మహిళలు తిరగబడతారు. మాన, ప్రాణ ఆత్మరక్షణ కోసం ఆయుధాలతో దాడులు చేసి తమల్ని తాము రక్షించుకుంటారు.

ఇదేం కసి.. ఇంటికి పిలిచి మర్మాంగం కట్ చేసిన మహిళ!
X

దిశ, వెబ్‌డెస్క్: సహజంగా ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురిచేస్తేనో.. అత్యాచారయత్నం చేయబోతేనో మహిళలు తిరగబడతారు. మాన, ప్రాణ ఆత్మరక్షణ కోసం ఆయుధాలతో దాడులు చేసి తమల్ని తాము రక్షించుకుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఓ మహిళ మాత్రం రోడ్డున పోయే వ్యక్తిని ఇంట్లోకి పిలిచి మర్మాంగం కోసి పంపించింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మంజన్‌పూర్ మండలం షరీఫ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్ల క్రితం జీవనోపాధి కోసం యూఏఈకి వెళ్లాడు. అప్పటి నుంచి ఆయన భార్య (32) ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది. అయితే ఉన్నట్టుండి ఆ మహిళ వింతగా ప్రవర్తించింది. పక్కింటి వ్యక్తి రోడ్డు మీదికి రాగా.. ఆయనను ఇంట్లోకి పిలిచి మర్మాంగం కట్ చేసింది. తీవ్ర రక్తస్రావం అయిన అతడు గట్టిగా కేకలు వేయడంతో పక్కింట్లో ఉన్న కుటుంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే అందరూ ఆమెపై అత్యాచారం చేయబోతే పురుషాంగం కట్ చేసి ఉంటుందని భావించారు. కానీ ఆస్పత్రిలో బాధితుడి వాంగ్మూలం విని పోలీసులతో సహా గ్రామస్తులు షాక్ అయ్యారు. రోడ్డుపైకి వచ్చిన తనను ఆమె ఇంట్లోకి పిలిచిందని, లోపలికి వెళ్లగానే తనను కిందపడేసి మర్మాంగం కట్ చేసిందని తెలిపాడు. ఈ హఠాత్ పరిణామంతో షాక్‌కు గురయ్యానని బాధితుడు వాపోయాడు.

కానీ ఆ మహిళ మాత్రం మరో విధంగా స్పందించింది. అతడు మా ఇంట్లోకి నేరుగా వచ్చి తనపై అత్యాచారం చేయబోయాడని తెలిపింది. ఆ సమయంలో నన్ను నేను రక్షించుకునేందుకు అతడి పురుషాంగాన్ని కట్ చేశానని చెబుతుంది. అయితే మహిళ చెప్పే విషయాలు పొంతన లేకపోవడంతో పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 326, 308 కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఘటన స్థలాన్ని పరిశీలించి అన్నీ కోణాల్లో విచారణ ప్రారంభించారు పోలీసులు.

Next Story