- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి సంపులో పడి పది ఏళ్ల బాలుడు మృతి
by Taduka Kalyani |
వికారాబాద్ జిల్లా యాలాల మండలం దౌలాపూర్ గ్రామంలో బాలుడు శివ కుమార్ (10) మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

X
దిశ, యాలాల: వికారాబాద్ జిల్లా యాలాల మండలం దౌలాపూర్ గ్రామంలో బాలుడు శివ కుమార్ (10) మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, యాలాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌలాపూర్ గ్రామానికి చెందిన వడ్డే వెంకటయ్య కుమారుడు శివ కుమార్ పంచాయతీ భవనం ముందున్న నీటి సంపులో నీళ్ల ను తీసుకురావడానికి వెళ్లిన బాలుడు సంపులో పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు బాలుడిని నీటి సంపు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Next Story






