ఆర్థిక ఇబ్బందులతో సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ ఆత్మహత్య

by Disha Web Desk 23 |
ఆర్థిక ఇబ్బందులతో సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ ఆత్మహత్య
X

దిశ,కూకట్​పల్లి: కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేపీహెచ్​బీ సీఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్​ గోదావరి జిల్లా, మండపేట్​, కేశవపురం గ్రామానికి చెందిన తమనపుడి భువన్​(24) అడ్డగుట్ట సొసైటిలోని అనుపమ హాస్టల్​లో నివాసం ఉంటు టీసీఎస్​ సాఫ్ట్​వేర్​ కంపెనిలో సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​గా పని చేస్తున్నాడు. భువన్​కు సోదరికి వివాహం అయింది. తండ్రి కొన్ని ఏండ్ల క్రితం మృతి చెందాడు. తల్లి పక్షవాతంతో ఉంది. గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవడంతో ఇబ్బంది పడుతున్నాడని, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed