- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన జీప్.. ఏడుగురు దుర్మరణం
ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం కెంఝహార్ జిల్లా బాలిజోడి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం కెంఝహార్ జిల్లా బాలిజోడి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






