కళ్లముందే కూతురిపై అత్యాచారయత్నం.. కోపంలో తండ్రి ఏం చేశాడంటే?

by Gantepaka Srikanth |

దీపావళి(Diwali) పండుగపూట ఒడిశా(Odisha) రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

కళ్లముందే కూతురిపై అత్యాచారయత్నం.. కోపంలో తండ్రి ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి(Diwali) పండుగపూట ఒడిశా(Odisha) రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురిపై అత్యాచారయత్నానికి(Rape Attempt) పాల్పడిన వ్యక్తిని తండ్రి హతమార్చాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండటాన్ని చూసి ఓ యువకుడు అఘాయిత్యం చేయబోయాడు. సరిగ్గా అదే సమయంలో బాలిక తండ్రి ఇంటికొచ్చాడు. కూతురిపై అత్యాచారయత్నం చేయబోయిన యువకుడ్ని కొట్టి చంపాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. మూడ్రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నారు. అత్యాచారయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story