పురుగుల మందు తాగి యువకుడు మృతి

by Bhanu |

అడవి శ్రీరాంపూర్‌కు చెందిన చొప్పరి సదానందం (30) పురుగుల మందు తాగి మృతి చెందాడు. ముత్తారం ఎస్సై గోపతి..

పురుగుల మందు తాగి యువకుడు మృతి
X

దిశ, ముత్తారం: అడవి శ్రీరాంపూర్‌కు చెందిన చొప్పరి సదానందం (30) పురుగుల మందు తాగి మృతి చెందాడు. ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సదానందం కూలిపనులు చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం సేవిస్తూ తిరుగుతుండేవాడు.

శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెతికితే, అతడు ఊర చెరువు వద్ద పడి ఉన్నట్లు గుర్తించారు. దగ్గరకు వెళ్లి చూసినప్పుడు మద్యం మత్తులో ఏదో పురుగుల మందు సేవించినట్లు అనుమానించి వెంటనే అతడిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వెళ్లినప్పటికే అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని కియా హాస్పిటల్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. "నా భర్త మృతి పట్ల ఎవరి పైనా ఎలాంటి అనుమానం లేదు" అని భార్య చొప్పరి భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గోపతి నరేష్ తెలిపారు.

Next Story