- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఒత్తిడితో యువకుడి ఆత్మహత్య.. చికిత్స పొందుతూ మృతి
by Bhanu |
ఆర్థిక సమస్యలు తాళలేక యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జగిత్యాల జిల్లాలోని మోతే గ్రామంలో

X
దిశ, జగిత్యాల రూరల్: ఆర్థిక సమస్యలు తాళలేక యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జగిత్యాల జిల్లాలోని మోతే గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంగేపు చందు కుమార్ (22) ఈ నెల 6న గ్రామ శివారులోని నల్లగుట్ట వద్ద గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి బుధవారం ఉదయం (జూలై 9) చందు కుమార్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుని సోదరుడు సంగేపు రాజకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






