- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్‌లు ఢీ కొన్న ఘటన.. బిర్యానీ తినొస్తూ అనంతలోకాలకు..
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిర్యానీ తినడానికి వెళ్లి తిరిగి వస్తుండగా రెండు బైకులు ఢీకొనడం వల్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

దిశ, పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిర్యానీ తినడానికి వెళ్లి తిరిగి వస్తుండగా రెండు బైకులు ఢీకొనడం వల్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఎస్సై కిరణ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బోగ సత్యనారాయణ, తాటిపాముల భాస్కర్, తాటిపాముల మధుకర్, కొత్తూరు నవీన్ అనే నలుగురు స్నేహితులు మంగళవారం రాత్రి మద్యం సేవించి రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి బిర్యానీ తినేందుకు వెళ్లారు.
తర్వాత తిరిగి వస్తుండగా నరసింహునిపేట గ్రామం వద్ద ముందు వెళ్తున్న స్కూటీ బైక్ ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో వెనకాలే వస్తున్న యూనికార్న్ బైక్ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో నలుగురు కిందపడి తీవ్రంగా గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ బోగ సత్యనారాయణ (25) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు.






