కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

by Kema Shiva Kumar |

కుటుంబ కలహలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కొల్చారం మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
X

కొల్చారం మండల కేంద్రంలో ఘటన

దిశ, కొల్చారం : కుటుంబ కలహలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కొల్చారం మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై సార శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు కొల్చారం గ్రామానికి చెందిన చింతల గంగరాజు (35)కు 11 ఏళ్ల క్రితం రంగంపేట గ్రామానికి చెందిన లింగాల లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలే, వారికి కొడుకు లేడని తరచూ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో గంగరాజు మద్యానికి బానిసై తాగి ఇంటికి వచ్చి భార్యతో తరచూ గొడవ పడేవాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య లక్ష్మితో గొడవకు దిగాడు. గంగరాజు భార్యను విపరీతంగా కొట్టిన విషయం తెలిసిన మృతుడి తల్లి కిష్టమ్మ లక్ష్మిని తను ఉండే ఇంటికి తీసుకెళ్లింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గంగరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై సార శ్రీనివాస్ గౌడ్ కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తి మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Next Story