- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నారాయణపేటలో యువకుడిపై విచక్షణారహిత దాడి
ముగ్గురు యువకులు మరో యువకుడిని విచక్షణారహితంగా దాడికి పాల్పడడంతో యువకుడు హైదరాబాద్

దిశ, నారాయణపేట క్రైం: ముగ్గురు యువకులు మరో యువకుడిని విచక్షణారహితంగా దాడికి పాల్పడడంతో యువకుడు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని లాల్ మజీద్ సమీపంలో ఉండే ఓ మైనారిటీ యువకుడిని మరో ముగ్గురు మైనారిటీ యువకులు మాటా మాటా పెరిగి దాడి చేయడంతో యువకుడి తలకు బలమైన గాయమైంది. దీంతో బాధిత యువకుడిని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో తల్లిదండ్రులు చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై బాధిత తల్లిదండ్రులు నారాయణపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదయింది. ఇదిలా ఉండగా గంజాయి మత్తు కారణంగానే దాడి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోతైన విచారణ జరిగితే గాని పూర్తిస్థాయి డొంక కదిలే పరిస్థితి లేదు. ఈ ఘటనపై పలురు మైనార్టీ నాయకులు దాడి ఘటనను ఖండిస్తున్నారు. దాడికి పాల్పడిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






