మెట్రో లిఫ్ట్‌లో మహిళకు ప్రైవేట్ పార్ట్స్ చూపించిన యువకుడు..

by Mallepaka Hamsa |

సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలు బయటకు వెళ్తే చాలు కొంత మంది కామాంధులు వారిని ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

మెట్రో లిఫ్ట్‌లో మహిళకు ప్రైవేట్ పార్ట్స్ చూపించిన యువకుడు..
X

దిశ, వెబ్ డెస్క్: సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలు బయటకు వెళ్తే చాలు కొంత మంది కామాంధులు వారిని ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఢిల్లీలోని మెట్రో లిఫ్ట్‌‌లో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీలోని మెట్రో లిఫ్ట్‌లో ఓ మహిళ ఎక్కగా అందులోకి రాజేష్ అనే యువకుడు ప్రవేశించాడు. ఆ తర్వాత తన ప్రైవేట్ పార్ట్స్ బయటపెట్టి ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయిన మహిళ అరుస్తూ వెంటనే లిఫ్ట్‌ను ఆపి అందులోంచి బయటకు వచ్చింది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story