- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని యువకుడి హత్య
రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అక్రమసంబంధం పెట్టుకున్నాడని మహిళ బంధువులు యువకుడిని కొట్టిచంపారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అక్రమసంబంధం పెట్టుకున్నాడని మహిళ బంధువులు యువకుడిని కొట్టిచంపారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివాహితతో సంబంధం పెట్టుకుని ఆమె విడాకులకు కారణం అయ్యాడని శ్యామ్ చారి అనే యువకుడిపై మహిళ బంధువులు దాడి చేశారు. యువకుడిని డ్రిప్ పైపులు, కర్రలతో కొట్టగా తీవ్రంగా గాయాలపాలయ్యాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ నెల 26న యువకుడిపై దాడి జరగ్గా దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంసాగర్ గ్రామానికి చెందిన శ్యామ్ అదే గ్రామానికి చెందిన వివాహితతో సంబంధం పెట్టుకోవడంతో ఆ విషయం తెలిసి భర్త విడాకులు ఇచ్చాడు. అప్పటి నుండే శ్యామ్ పై మహిళ కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. దాడిలో శ్యామ్ తలకు బలమైన గాయాలు అయినట్టు తేలింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 20 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో భయాందోళనకర వాతావరణం నెలకొంది.






