రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

by Bhanu |

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
X

దిశ, అలంపూర్ టౌన్: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే, ఉండవెల్లి మండలంలోని డి. బూడిదపాడు సమీపంలో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. అలంపూర్ మండలంలోని లింగనవాయికి చెందిన ఇస్మాయిల్ (30) అనే యువకుడు కర్నూలు నుండి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది.

తీవ్రంగా గాయపడిన ఇస్మాయిల్‌ను సమీపంలోని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story