ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై యువకుడు ఆత్మహత్య

by Ajay Maddhiboyina |

ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆన్ లైన్స్ గేమ్స్ లో లక్షలు, కోట్లు పోగొట్టుకుని చివరికి అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై యువకుడు ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆన్ లైన్స్ గేమ్స్ లో లక్షలు, కోట్లు పోగొట్టుకుని చివరికి అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజా ఓ యువకుడు సైతం ఆన్ లైన్ గేమ్స్‌కు బలయ్యాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రవీందర్ 24 అనే యువకుడు కొంతకాలంగా అన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. డబ్బులు పోగొట్టుకోవడంతో సెల్ఫీ వీడియో తీసుకుని అనంతరం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వీడియోలో తన చావుకు ఎవరూ బాధ్యలు కాదని చెప్పాడు. తన స్నేహితుడు కూడా అన్ లైన్ గేమ్స్ ఆడి ఆత్మహత్య చేసుకున్నాడని అతడిని చూసి కూడా తాను మారలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చేసిన తప్పు ఆన్ లైన్ గేమ్స్ ఆడటం మాత్రమేనని చెప్పాడు. తనలా మరెవరూ కావద్దని తన మిత్రులలో తనదే చివరి చావు కావాలని చెప్పాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story