ఉద్యోగానికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం.. యువ ఇంజనీర్ మృతి

by Chintha Aamani |

తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు పులిచింతల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

ఉద్యోగానికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం.. యువ ఇంజనీర్ మృతి
X

దిశ, ఊట్కూర్ : తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు పులిచింతల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని బిజ్వార్ గ్రామానికి చెందిన శివరాజ్ మృత్యువాత పడ్డాడు. బిజ్వార్ గ్రామానికి చెందిన బాబు, వెంకటమ్మ ల కుమారుడు శివరాజ్. చిన్నతనంలోనే తండ్రి బాబు గుండెపోటుతో చనిపోయాడు. తల్లి, అన్నయ్య వెంకటేష్, కుటుంబ సభ్యులు సిద్ధూ శివరాజుకు చదువుపై ఆసక్తి గమనించి ఉన్నత విద్యను చదివించారు. పదవ తరగతి వరకు గ్రామంలోనే చదివి ఉన్నత విద్య ను మహబూబ్ నగర్, హైదరాబాద్ లో అభ్యసించారు. టీఎస్పీఎస్పీ నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో విద్యుత్ ఏఈగా నాగార్జున సాగర్ జల విద్యుత్ ప్రాజెక్టులో జీవనం సంపాదించాడు.

ఈ ఏడాది జనవరిలో ఉద్యోగం చేరాడు. నాగార్జునసాగర్ ఉన్నతాధికారుల అవసరం రీత్యా ఆంధ్ర తెలంగాణ భాగస్వామ్యంగా ఉన్న పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్టు అతనికి ఉద్యోగం ఇచ్చారు. అయితే సోమవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై బయలుదేరిన శివరాజును ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడని అంబులెన్స్ లో 25 కిలోమీటర్ల దూరంలోని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న శివరాజు ను ప్రాథమిక చికిత్స అనంతరం 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ మెట్రో సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. అయితే శివరాజు ఏడు నెలల క్రిందనే అసిస్టెంట్ ఇంజనీర్ గా పులిచింతల జల విద్యుత్ కేంద్రంలో కొలువులో చేరాడు. బతుకుదెరువు కొరకు సుదూర ప్రాంతాలకు వెళ్లిన శివరాజ్ ఏడు నర నెలలకు మృత్యువాత పడటంతో బాధిత కుటుంబంలో ఆదుకోవాలని, కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గ్రామస్తులు, ఆయా పార్టీలో నాయకులు విజ్ఞప్తి చేశారు.

Next Story