- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ యువ నాయకుడు మృతి
మండలంలోని వరిగుంతం సబ్ స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మరెల్లి అనిల్ (28) చికిత్స పొందుతూ మెదక్ లోని క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో మృతి చెందాడు.

దిశ,కొల్చారం: మండలంలోని వరిగుంతం సబ్ స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మరెల్లి అనిల్ (28) చికిత్స పొందుతూ మెదక్ లోని క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో మృతి చెందాడు. పైతర గ్రామానికి చెందిన మరేలియా అనిల్ మండలంలోని సంగాయిపేట భారత్ పెట్రోల్ పంప్ యజమాని.అతను మెదక్ వైపు నుండి రంగంపేట వైపు వస్తుండగా మార్గ మధ్యలో తాను ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే 108 సాయంతో చికిత్స నిమిత్తం మెదక్ క్రిటికల్ కేర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. మృతుడు అనిల్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా దళిత సంఘాల నాయకుడిగా ప్రజల్లో స్వల్ప కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనిల్ మృతితో పైతర , సంగాయిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.






