- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ కొనివ్వకపోతే చస్తానని బెదిరించి.. కొనిచ్చిన 2 రోజులకే!
బైక్ కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కుమారుడు కొనుగోలు చేసిన తరవాత రెండు రోజులకే యాక్సిడెంట్‌లో మరణించాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. మహారాణిపేటలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాస్ కుమారుడు హరీష్ (19) ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: బైక్ కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కుమారుడు కొనుగోలు చేసిన తరవాత రెండు రోజులకే యాక్సిడెంట్‌లో మరణించాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. మహారాణిపేటలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాస్ కుమారుడు హరీష్ (19) ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. కొంతకాలంగా హరీష్ తనకు బైక్ కొనివ్వాలని లేదంటే చనిపోతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కుమారుడు అలిగి మొండిపట్టు పట్టడంతో తల్లిదండ్రులు చేసేది లేక దసరా పండుగ రోజు రూ.3 లక్షలు అప్పు చేసి బైక్ కొనిచ్చారు.
కానీ బైక్ కొనుకున్న సంతోషం ఆ యువకుడికి రెండు రోజులు కూడా లేదు. కోనుగోలు చేసిన రెండు రోజులకే టిఫిన్ చేయడానికి హరీష్ తన స్నేహితుడితో కలిసి బైక్ పై ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా హై స్పీడ్ కారణంగా అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టారు. ప్రమాదంలో హరీష్ కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి స్నేహితుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది.






