- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన PUBG గేమ్.. రాత్రి 3గంటల వరకు ఆడి యువకుడు మృతి
ఆన్ లైన్ వీడియో గేమ్స్ పిల్లలు, యువకుల పట్ల శాపంగా మారాయి. వీడియో గేమ్స్ వ్యామోహంలో పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఆన్ లైన్ వీడియో గేమ్స్ పిల్లలు, యువకుల పట్ల శాపంగా మారాయి. వీడియో గేమ్స్ వ్యామోహంలో పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వీడియో గేమ్స్ ఆడొద్దని ఇంట్లో వాళ్లు మందలించడంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటే ఆటకు బానిసై అనారోగ్యాలతో మరికొందరు మరణిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు పబ్జీ ఆడుతూ తీవ్రఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. మీరట్ లోని ఖైర్ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ కైఫ్ 22కు పబ్జీ గేమ్ ఆడే అలవాటు ఉంది.నాలుగు నెలలుగా అతడు పబ్జీకి బానిసయ్యాడు. రాత్రింభవళ్లు అదే పనిగా గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. అనేకసార్లు కుటుంబ సభ్యులు మందలించినా అతడి తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తెల్లవారుజామున పబ్జీ ఆడుతున్న సమయంలో ఒత్తిడికి నరాలు చిట్లిపోయాయి. ఒక్కసారిగా అతడు మంచంపై నుండి కిందపడిపోయాడు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతడి బీపీ 300దాటిందని పరిస్థితి విషమంగా ఉందని ఢిల్లీకి రిఫర్ చేశారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో రెండు రోజుల పాటు చికిత్స పొందిన కైఫ్ ఆదివారం ఉదయం మరణించాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిరంతర ఆందోళన మరియు నిద్రలేకపోవడం వల్లనే కైఫ్ మెదడులో నరాలు చిట్లిపోయాయని వైద్యులు వెల్లడించారు.






