పురుగుల మంది తాగి కూలీ ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

కుటుంబ క‌ల‌హాల‌తో పురుగుల మందు తాగి కూలీ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న చిన్న‌శంక‌రంపేట మండ‌లం ద‌రిప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

పురుగుల మంది తాగి కూలీ ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, చిన్న శంక‌రంపేట : కుటుంబ క‌ల‌హాల‌తో పురుగుల మందు తాగి కూలీ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న చిన్న‌శంక‌రంపేట మండ‌లం ద‌రిప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ద‌రిప‌ల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల పోచయ్య ( 47) కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఈనెల 21న మద్యం మత్తులో అతని భార్య, కుటుంబ సభ్యులతో గొడవపడి మనస్థాపానికి గురై గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. దీంతో గాంధీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడని ఏఎస్ఐ విఠ‌ల్ తెలిపారు. మృతునికి భార్య యాదమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య యాద‌మ్మ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు ఏఎస్ఐ విఠ‌ల్ తెలిపారు.

Next Story