విద్యుదాఘాతంతో శ్రామికుడు మృతి

by Taduka Kalyani |

విద్యుదాఘాతంతో బ్యాండ్ మేళం శ్రామికుడు మృతి చెందిన సంఘటన హాలియా పట్టణంలో చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో శ్రామికుడు  మృతి
X

దిశ, హాలియా : విద్యుదాఘాతంతో బ్యాండ్ మేళం శ్రామికుడు మృతి చెందిన సంఘటన హాలియా పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల గ్రామంలోని కేవీ కాలనీకి చెందిన తక్కెళ్ళపల్లి దుర్గయ్య వయసు సుమారు 40 సంవత్సరాలు గల వ్యక్తి సోమవారం రాత్రి హాలియా పట్టణంలోని ప్రాథమిక పాఠశాల వెనక శుభకార్యానికి బ్యాండ్ మేళం వాయించేందుకు వెళ్లారు. కాగా రాత్రి సుమారు 9 గంటల సమయంలో దుర్గయ్య మూత్ర విసర్జన కోసం వెళ్లిన సమయంలో కరెంటు స్తంభం వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలంలో ట్రాన్స్ఫార్మర్ వైర్లు ఉండడమే ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. ఏది ఏమైనా శ్రామికుడు మృతి చెందడం పట్ల పలువురు విచారణ వ్యక్తం చేస్తున్నారు.

Next Story