ఫ్యాక్టరీలో ప్రమాదం.. ట్రక్ ఢీకొని కార్మికుడి మృతి

by Batti.Sumithra |

ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫ్యాక్టరీలో ప్రమాదం.. ట్రక్ ఢీకొని కార్మికుడి మృతి
X

దిశ, సంగారెడ్డి : ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా ఇంద్రకరణ్‌లోని ఆరో వ్యాక్సిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అరబిందో ఫార్మా) యూనిట్-18లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధీరజ్ కుమార్ (30) కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 26న మధ్యాహ్నం అతడు బాయిలర్ వద్ద పని చేస్తుండగా, బ్రికెట్స్ లోడ్‌తో వచ్చిన ఐషర్ ట్రక్ (AP 39 VE 3229) డ్రైవర్ మహబూబ్ భాషా తన వాహనాన్ని అతివేగంగా రివర్స్ తీస్తూ ధీరజ్ కుమార్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధీరజ్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించగా, ఏప్రిల్ 27న చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇంద్రకరణ్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.

Next Story