- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యోగా గురువును ట్రాప్ చేసిన మహిళలు.. క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్
హైదరాబాద్ శివారులోని చేవెళ్లలో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారులోని చేవెళ్లలో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. యోగా గురువు(Yoga Tacher)ను హనీ ట్రాప్(Honey Trap) చేసి ఏకంగా రూ.50 లక్షలకు పైగా కాజేశారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella)లో రంగారెడ్డి(Ranga Reddy) అనే యోగా గురువు యోగ్రాశ్రమం(Yoga Ashram) నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఇటీవల ఇద్దరు మహిళలు అనారోగ్య సమస్యల పేరుతో యోగాశ్రమంలో చేరారు. వారు పక్కా ప్లాన్‌తో గురువు రంగారెడ్డికి క్లోజ్ అయ్యారు. ఆయనతో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని అమర్ గ్యాంగ్‌కు అందజేశారు.
వారు ఫొటోలు, వీడియోలతో యోగా గురువు రంగారెడ్డిని బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. దాదాపు రూ.50 లక్షల వరకూ వసూలు చేశారు. మరో రూ.2 కోట్లు ఇవ్వాలని అమర్ గ్యాంగ్ బ్లాక్‌మెయిల్ చేయడం షురూ చేసింది. ఇవ్వకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించసాగింది. దీంతో ఏం చేయాలో తెలియక యోగా గురువు గోల్కొండ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






