- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళా యువతులను మోసం చేసి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు బయటపెట్టారు.

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళా యువతులను మోసం చేసి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో డీఎస్పీ రామానుజం బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మొత్తం 7 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే, ఆసిఫాబాద్ మండలంలోని వాదిగొంది గ్రామానికి చెందిన ఓ యువతి ఏడాది క్రితం అదృశ్యమైంది. దర్యాప్తులో ఆమెను మాయమాటలు చెప్పి మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లి అక్కడి వ్యక్తులకు రూ.1.30 లక్షలకు అమ్మినట్లు గుర్తించారు.
ఆమెను అనైతిక రీతిలో వినియోగించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఇదే ముఠా మరో యువతిని రూ.1.10 లక్షలకు విక్రయించిన విషయంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అరెస్టైనవారు: రాజంపేటకు చెందిన హరిదాస్, టీఆర్ నగర్‌కు చెందిన సుజాత, పంచాపూల్, బెండారకు చెందిన ఉష, మంచిర్యాల ఇందిరమ్మ కాలనీకి చెందిన విజయలక్ష్మి. పరారీలో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన రమేష్ గౌడ్, జగదీష్, సురేఖ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
ఈ ముఠాలో ప్రధాన నిందితుడు హరిదాస్ ఓ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశాడని, 2019లో ఇదే తరహా కేసుతో తిర్యాణి పోలీస్ స్టేషన్‌లో సేవలుచేస్తుండగా సస్పెండ్ చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. యువతి ఆధార్ కార్డు అప్డేట్ సందర్భంగా ఇంటికి వచ్చిన అధికారులు ఆమె వివరాలు గుర్తించడంతో ఆమె తండ్రి కార్డు నెంబర్‌కు ఫోన్ చేసి తన కుమార్తె మోసపోయిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరిపి అరెస్టులు చేపట్టారు.






