రాజస్థాన్‌లో ఘోరం..ఐసీయూలో ఉన్న రోగిపై అత్యాచారం

by Ajay Maddhiboyina |

రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ఐసీయూలో ఉన్న రోగిపై అత్యాచారం జరిగింది. బుధవారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రాజస్థాన్‌లో ఘోరం..ఐసీయూలో ఉన్న రోగిపై అత్యాచారం
X

దిశ‌, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ఐసీయూలో ఉన్న రోగిపై అత్యాచారం జరిగింది. బుధవారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో ఓ మహిళ అనారోగ్యంతో అడ్మిట్ అయ్యింది. ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తుండగా ఆస్పత్రిలో పనిచేస్తున్న వార్డ్ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి బెడ్ చుట్టూ కర్టెన్లు వేసి ఆమెకు మత్తు మందు ఇచ్చాడు. అయినప్పటికీ ఆమెకు కొంత స్పృహ ఉండ‌టంతో కుటుంబ స‌భ్యుల‌ను పిలిచేందుకు ప్ర‌య‌త్నించింది.

ఆ త‌ర‌వాత పూర్తిగా మ‌త్తులోకి జారుకోగా అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. స్పృహ వ‌చ్చిన త‌ర‌వాత బాధితులు విష‌యాన్ని కుటుంబ స‌భ్య‌లుకు తెలిపింది. దీంతో ఆమె భ‌ర్త ఆస్ప‌త్రి యాజ‌మాన్యాన్ని నిల‌దీశాడు. కానీ యాజ‌మాన్యం ఖండించ‌డంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టారు. సీసీ టీవీ ఆధారంగా నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘ‌ట‌న‌పై క‌మిటీ వేసి విచారిస్తామ‌ని ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. ఈ ఘ‌ట‌న‌తో ఆస్ప‌త్రిలోని ఇత‌ర పేషంట్స్ కూడా భ‌య‌పోడిపోతున్నారు.

Next Story