- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య.. అనుమానాస్పదంగా సీసీ టీవీ ఫుటేజ్
హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న మహిళలను దుండగలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నగరంలోని దుండిగల్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న మహిళలను దుండగలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నగరంలోని దుండిగల్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సుశీలమ్మ అనే మహిళను దుండగులు హత్య చేసి అనంతరం అక్కడ నుండి పారిపోయారు. సోఫాలో సుశీలమ్మ మృతదేహం కనిపించగా వెంటనే కుటంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహంపై బలమైన గాయాలు ఉన్నట్టు గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తో కీలక ఆధారాలు సేకరించారు.
అనుమానాస్పదస్థితిలో మరణించి ఉండటంతో ఇది దొంగల పనా లేదంటే తెలిసినవారే డబ్బు, నగల కోసం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఇద్దరు అనుమానితులను సైతం పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య జరిగిన ప్రాంతంలో సంచరిస్తూ కనిపించారు. వారిలో ఒక యువకుడితో పాటు మర వ్యక్తి ఉన్నారు. ఇద్దరూ కంగారుపడుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అంతే కాకుండా ఇద్దరూ బైక్ పై కానీ వేరే వాహనంలో రాకుండా నడుచుకుంటూనే అక్కడ నుండి వెళ్లిపోయారు.






