- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్త లేని సమయంలో ప్రియుడితో రొమాన్స్.. ఓ బాలిక చూడటంతో దారుణం!
యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ భర్త లేని సమయంలో ప్రియుడితో కలవగా 6వ తరగతి బాలిక వారిద్దరినీ చూసింది. ఈ విషయాన్ని తన తండ్రికి చెబుతానని బాలిక బెదిరించడంతో మహిళ తన ప్రియుడితో కలిసి హత్య చేసింది.

దిశ, వెబ్ డెస్క్: యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ భర్త లేని సమయంలో ప్రియుడితో కలవగా 6వ తరగతి బాలిక వారిద్దరినీ చూసింది. ఈ విషయాన్ని తన తండ్రికి చెబుతానని బాలిక బెదిరించడంతో మహిళ తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన యూపీలోని హత్రాస్ లో చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్న బాలిక బుధవారం నుండి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె కోసం గాలించగా ఓ బావిలో డెడ్ బాడీ కనిపించింది. బావిలో పడేసిన ఓ గోనె సంచిలో డెడ్ బాడీని కట్టేసి పడేశారు.
సంచి విప్పి చూడగా బాలిక మెడకు తాడుతో బిగించి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి మహిళను అదపులోకి తీసుకుని విచారించగా తప్పును ఒప్పుకుంది. తనకు 17ఏళ్ల మైనర్ బాలుడితో సంబంధం ఉన్నట్టు ఒప్పుకుంది. తన భర్త, అత్త మామ ఇంట్లో లేని సమయంలో బాలుడు వచ్చినట్టు చెప్పింది. తమను బాలిక చూసి తన తండ్రికి చెబుతానని బెదిరించినట్టు తెలిపింది. చెప్పొద్దని కోరినప్పటికీ బాలిక వినలేదని అందుకే చంపేశామని ఒప్పుకుంది. దీంతో పోలీసులు మహిళతో పాటు ఆమె ప్రియుడిని సైతం అరెస్ట్ చేశారు.






