- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడుకోవాలని పిల్లలకు ఫోన్ ఇచ్చి.. హుస్సేన్ సాగర్‌లో దూకి తల్లి ఆత్మహత్య
ఆడుకోవాలని పిల్లలకు ఫోన్ ఇచ్చి తల్లి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయనో.. గొడవలు జరిగాయనో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కువగా తల్లి దండ్రులు పిల్లలను హత్య చేసి తాము సైతం ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొన్ని కేసుల్లో పిల్లలను అనాథలుగా చేసి తాము ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆడుకోవాలని పిల్లలకు ఫోన్ ఇచ్చి తల్లి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన వసంత అనే మహిళ తన భర్త చనిపోవడంతో ఇద్దరు కుమారులతో కలిసి ఉంటుంది. అయితే 4ఏళ్ల క్రితం భర్త మరణించడంతో ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే మనస్థాపం చెంది కుమారులతో కలిసి ట్యాంక్ బండ్ వద్దకు వచ్చింది. ఆడుకోవాలని పిల్లలకు ఫోన్ ఇచ్చి అనంతరం హుస్సేస్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.






