యూపీలో ఘోరం.. జర్నలిస్టును కిడ్నాప్ హత్యాయత్నం

by Ajay Maddhiboyina |

యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ జ‌ర్న‌లిస్టు, యూట్యూబ‌ర్ ను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హ‌తమార్చాల‌ని ప్ర‌య‌త్నించారు. ఈ ఘ‌ట‌న మీర్జాపూర్ లో చోటు చేసుకుంది.

యూపీలో ఘోరం.. జర్నలిస్టును కిడ్నాప్ హత్యాయత్నం
X

దిశ‌, వెబ్ డెస్క్: యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ జ‌ర్న‌లిస్టు, యూట్యూబ‌ర్ ను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హ‌తమార్చాల‌ని ప్ర‌య‌త్నించారు. ఈ ఘ‌ట‌న మీర్జాపూర్ లో చోటు చేసుకుంది. మీర్జాపూర్ లో స‌రితా ప‌టేల్ అనే మ‌హిళా జ‌ర్న‌లిస్టు, యూట్యూబ‌ర్ ఏప్రిల్ 30 నుండి కనిపించ‌కుండా పోయింది. ఆమెను కొంత‌మంది దుండ‌గులు కిడ్నాప్ చేసి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దాడి చేశారు. ఆమె నోరు, కాళ్లు, చేతులు క‌ట్టేసి తీవ్రంగా గాయ‌ప‌ర్చారు. అనంత‌రం ఆధారాలు దొర‌క‌కుండా పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టే ప్లాన్ చేశారు.

కానీ ఇంత‌లోనే ఓ పెళ్లి భార‌త్ అక్క‌డి రావ‌డంతో దొరికిపోతామేమో అనే భ‌యంతో అక్క‌డ నుండి ప‌రుగులు తీశారు. స్థానికులు స్పృహ‌కోల్పోయి ఉన్న మ‌హిళా జ‌ర్న‌లిస్టును చూసి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా ప్ర‌స్తుతం చికిత్స పొందుతోంది. ఇక యూపీలో ఇలా జ‌ర్న‌లిస్టులు మిస్ అయిన ఘ‌ట‌న‌లు దాదాపు 20 వ‌ర‌కు జ‌రిగి ఉంటాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మ‌ పార్టీల‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాస్తున్నార‌ని జ‌ర్న‌లిస్టుల‌ను కిడ్నాప్ చేసి వారిని క‌నిపించ‌కుండా చేస్తున్నారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Next Story