ఇన్‌స్టంట్ నూడుల్స్ తిని మహిళ మృతి

by Ajay Maddhiboyina |

ఇన్‌స్టంట్ నూడుల్స్, ఐస్ క్రీం తిన్న ఓ మ‌హిళ అక‌స్మాత్తుగా అనారోగ్యానికి గురై మర‌ణించింది. ఈ ఘటన హరియానాలోని ఫరీదాబాద్ లో చోటు చేసుకుంది. గ్రీన్ ఫీల్డ్ కాలనీలో నివాసం ఉంటున్న రాకేష్ గుజ్రాల్ అనే వ్యక్తి ఇంట్లో చాలా కాలంగా సోమా ఖాటూన్ అనే యువతి పనిచేస్తోంది.

ఇన్‌స్టంట్ నూడుల్స్ తిని మహిళ మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇన్‌స్టంట్ నూడుల్స్, ఐస్ క్రీం తిన్న ఓ మ‌హిళ అక‌స్మాత్తుగా అనారోగ్యానికి గురై మర‌ణించింది. ఈ ఘటన హరియానాలోని ఫరీదాబాద్ లో చోటు చేసుకుంది. గ్రీన్ ఫీల్డ్ కాలనీలో నివాసం ఉంటున్న రాకేష్ గుజ్రాల్ అనే వ్యక్తి ఇంట్లో చాలా కాలంగా సోమా ఖాటూన్ అనే యువతి పనిచేస్తోంది. అయితే ఇంట్లో రాత్రి పడుకునేముందు సోమా ఖాటూన్ ఇన్ స్టంట్ నూడుల్స్ తయారు చేసుకుని తినడంతో పాటు ఐస్ క్రీం తిన్నది.

ఐస్ క్రీం తిన్న వెంటనే యువతి నోటి నుండి నురుగు రావడంతో నురుగు వస్తూ కుప్పకూలిపోయిందని ఇంటి యజమాని రాకేష్ యువతి తల్లి మనోర్బాకు సమాచారం అందించారు. యువతిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు. యువతికి తల్లితో పాటు నలుగురు తోబుట్టువులు తండ్రి ఉన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరవాత అసలు కారణం వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Next Story