వంట‌రాద‌ని, చ‌దువుకోలేద‌ని వేధింపులు.. మ‌న‌స్తాపంతో భార్య ఆత్మ‌హ‌త్య‌

by Ajay Maddhiboyina |

ఇటీవ‌ల కాలంలో చిన్న చిన్న గొడ‌వ‌ల‌కే ఆత్మ‌హ‌త్య చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఏ స‌మ‌స్య‌కైనా ప‌రిష్కారం ఉంటుంది కానీ ఆలోచించ‌కుండానే ఆవేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకుంది.

వంట‌రాద‌ని, చ‌దువుకోలేద‌ని వేధింపులు.. మ‌న‌స్తాపంతో భార్య ఆత్మ‌హ‌త్య‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇటీవ‌ల కాలంలో చిన్న చిన్న గొడ‌వ‌ల‌కే ఆత్మ‌హ‌త్య చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఏ స‌మ‌స్య‌కైనా ప‌రిష్కారం ఉంటుంది కానీ ఆలోచించ‌కుండానే ఆవేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకుంది. వంట‌రాద‌ని, చ‌దువుకోలేదని భ‌ర్త వేధింపుల‌కు గురిచేయ‌డంతో భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న వికారాబాద్ జిల్లా ప‌రిగి మండ‌లం మ‌ల్లెమోనిగూడెంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన శివ‌లింగం అనే వ్య‌క్తికి ధ‌రూర్ మండ‌లం గంగారం గ్రామానికి చెందిన శిరీష(21)తో వివాహం జ‌రిగింది. కాగా వంట స‌రిగ్గా చేయ‌డం లేద‌ని, త‌న కంటే త‌క్కువ చ‌దువుకుంద‌ని భ‌ర్త వేధింపుల‌కు గురిచేయ‌డంతో పాటు పుట్టింట్లో వ‌దిలిపెట్టాడు. త‌ర‌వాత రోజు ఫోన్ చేయ‌గా నువ్వు నాకు అక్క‌ర్లేదు అక్క‌డే చావు అంటూ దూశించ‌డంతో వేధింపులతో విసిగిపోయి శిరీష ఆత్మ‌హ‌త్య చేసుకుంది. భ‌ర్త వేధింపుల కార‌ణంగా త‌మ కూతురు ఆత్మ‌హత్య చేసుకుంద‌ని శిరీష త‌ల్లి దండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story