- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాపం.. ఏం కష్టం వచ్చిందో.. రెండేళ్ల చిన్నారితో కలిసి
హుస్సేస్ సాగర్‌లో మంగళవారం కనిపించిన మహిళ డెడ్ బాడీ మిస్టరీ వీడింది. మృతురాలు పాతబస్తీకి చెందిన కీర్తిక అగర్వాల్‌గా పోలీసులు గుర్తించారు. మహిళ తన రెండేళ్ల కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలో నివాసం ఉంటున్న పృథ్వీలాల్, కీర్తిక అగర్వాల్ భార్యాభర్తలు.

దిశ, వెబ్ డెస్క్: హుస్సేస్ సాగర్‌లో మంగళవారం కనిపించిన మహిళ డెడ్ బాడీ మిస్టరీ వీడింది. మృతురాలు పాతబస్తీకి చెందిన కీర్తిక అగర్వాల్‌గా పోలీసులు గుర్తించారు. మహిళ తన రెండేళ్ల కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలో నివాసం ఉంటున్న పృథ్వీలాల్, కీర్తిక అగర్వాల్ భార్యాభర్తలు. పృథ్వీలాల్ వ్యాపారం చేస్తుండగా కీర్తిక చార్టెడ్ అకౌంట్‌గా ఉద్యోగం చేస్తోంది. వీరికి బియారా అనే కుమార్తె ఉంది. కాగా ఏడాదిన్నర కాలంగా దంపతుల మధ్య గొడవలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
దీంతో కీర్తిక బహదూర్ పురలోని తన తల్లిదండ్రుల ఇంటివద్దనే ఉంటోంది. ఈ నెల 2న కీర్తిక హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోగా సోమవారం స్థానికులు డెడ్ బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో పోలీసులు మృతురాలు కార్తీకగా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కార్తీక తన కుమార్తెతో కలిసి వెళ్లిందని తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా రెండేళ్ల బియారా మృతదేహం కూడా హుస్సేన్ సాగర్ లోనే బయటపడింది. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.






