- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా నది తీరాన మహిళ డెడ్‌బాడీ లభ్యం.. సగభాగం పూర్తిగా కాలిపోయి..
రాష్ట్రంలో మహిళలలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళలలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా, కృష్ణా నది (Krishna River) తీరాన సగం కాలిన మహిళ మృతదేహం లభ్యమవడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా పెంట్లవెల్లి (Pentlavelli) మండల పరిధిలోని మంచాలకట్ట (Manchalakatta) సమీపంలోని చాకలి రాముడుగుట్టలో సగం కాలి గుర్తు తెలియని మహిళ డెడ్‌బాడీని గొర్రెల కాపరులు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందజేయడంతో ఎస్సై రామన్ గౌడ్ తన సిబ్బందితో స్పాట్‌కు చేరుకున్నారు.
అయితే, మహిళ మృతదేహం సగం కాలిపోవడంతో మొహం అసలు గుర్తుపట్టేందుకు వీలు లేకుండా పోయింది. అయితే, సదరు మహిళను హతమార్చి కాల్చేశారా..? లేక అత్యాచారం చేసి చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇటీవల కాలంలో సమీప పోలీస్ స్టషన్ల పరిధిలో మహిళల మిస్సింగ్ కేసులపై కూడా ఆరా తీస్తున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు.






