స్మార్ట్‌గా ఆలోచించిన మహిళ.. ఫోన్ కొట్టేసిన దొంగను ఎలా పట్టుకుందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

by D.Markandeya |
స్మార్ట్‌గా ఆలోచించిన మహిళ.. ఫోన్ కొట్టేసిన దొంగను ఎలా పట్టుకుందో తెలిస్తే షాకవ్వాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: దొంగల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అవకాశం దొరకడం ఆలస్యం చేతికందిన వస్తువు లాక్కుని పారిపోతున్నారు. మన ఆ షాక్‌ నుంచి తేరుకునే సరికి దొంగ పారిపోయి ఉంటాడు. ఆ తర్వాత మనం పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా మన వస్తువు మన చేతికి వస్తుందో లేదో తెలీదు. అయితే తాజాగా ఓ మహిళ మాత్రం తన ఫోన్ కాజేసిన దొంగను స్మార్ట్‌గా ఆలోచించి పట్టుకుంది. గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెటిజన్లు ఆశ్చర్యపరుస్తోంది. తన ఫోన్ కొట్టేసిన వ్యక్తిని కేవలం మూడు గంటల్లోనే పట్టుకున్న ఆమె మేథస్సుకు నెటిజన్లు సలాం కొడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ ఫోన్ కొట్టేసిన ఓ దొంగ పారిపోయాడు. ఆ షాక్‌ నుంచి వెంటనే తేరుకున్న ఆ మహిళ తన చేతికి ఉన్న స్మార్ట్ వ్యాచ్ సహాయంతో తన ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసింది.

ఆ తర్వాత గంటల వ్యవధిలోనే తన ఫోన్ తిరిగి పొందింది. ఈ క్రమంలో అతడి తలపై బలంగా కొట్టి తన ఫోన్ తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించి అతడిపై ఫిర్యాదు చేసింది. అయితే తాను మార్కెట్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్న సమయంలో అతడు తన ఫోన్ లాక్కున్నాడని, ఆ తర్వాత తన స్మార్ట్ వ్యాచ్ సహాయంతో అతడి లొకేషన్ తెలుసుకుని, అతడి తలపై కొట్టి ఫోన్ తీసుకున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బాధితురాలు నిందితుడి కోసం వెతుకుతున్న సమయంలో అతడు ఆమె యూపీఐ పిన్ ద్వారా రూ.50.865 కాజేశాడని తెలిపారు.

Next Story

Most Viewed