- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్ష్మారెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్రగాయాలై చికిత్స..

దిశ, వనస్థలిపురం: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్రగాయాలై చికిత్స పొందుతూ చనిపోయింది. సీఐ నాగరాజు గౌడ్ వివరాల ప్రకారం.. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని సాయికుటీర్‌లో నివాసముండే కొమ్మ మల్లయ్య భార్య అలివేలు (60) కార్మికురాలిగా పనిచేస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మారెడ్డి పాలెం హనుమాన్ ఆలయ సమీపంలో హైవే రోడ్డు దాటుతుండగా.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ ఢీకొట్టింది.
తీవ్రగాయాలైన అలివేలును స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు వ్యాన్ డ్రైవర్ఇలియాస్ బిన్ హసన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.






