మహిళను చంపి, తగలబెట్టి.. నాలుగు బస్తాల్లో కుక్కి దారుణం.. కాబోయే భర్తే ప్రధాన నిందితుడా?

by Naga Rani Yarlagadda |

లేటు వయసులో పెళ్లి చేసుకునేందుకు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన మహిళ దారుణ హత్యకు గురైంది.

మహిళను చంపి, తగలబెట్టి.. నాలుగు బస్తాల్లో కుక్కి దారుణం.. కాబోయే భర్తే ప్రధాన నిందితుడా?
X

దిశ, వెబ్‌డెస్క్: లేటు వయసులో పెళ్లి చేసుకునేందుకు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఆమెను పెళ్లాడాలనుకున్న వ్యక్తే ప్రధాన నిందితుడని పోలీసులు భావిస్తున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూకేకు చెందిన నాన్ రెసిడెంట్ ఇండియన్ చరణ్ జిత్ గ్రేవాల్ (75) ను 67 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకునేందుకు భారత సంతతి మహిళ రూపిందర్ కౌర్ పాంధర్ అమెరికా నుంచి పంజాబ్ కు ఈ ఏడాది జులైలో వచ్చింది. వీరిద్దరూ ఒక మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇండియాకు వచ్చాక పాంధర్.. చరణ్ జిత్ కు దశాబ్దకాలంగా పరిచయం ఉన్న సుఖ్ జీత్ సోను ఇంట్లో బస చేసింది. అయితే.. గ్రేవాల్ కు ఆమెతో సంబంధాన్ని కొనసాగించడం ఏమాత్రం నచ్చలేదు. దాంతో ఆమెను చంపేందుకు సుఖ్ జీత్ కు రూ.50 లక్షల సుపారీ ఇచ్చాడు.

సుఖ్ జీత్ సోను కిలా రాయ్‌పూర్‌లోని కోర్టు కాంప్లెక్స్‌లో టైపిస్ట్‌గా పనిచేస్తున్నారు. జులై 12న పాంధర్ నుమహిళను చంపి, తగలబెట్టి.. నాలుగు బస్తాల్లో కుక్కి దారుణం.. కాబోయే భర్తే ప్రధాన నిందితుడా? అతను బేస్ బాల్ బ్యాట్‌తో దారుణంగా హత్య చేసిన ఆరోపణలు ఉన్నాయి. హత్యానంతరం అతను మృతదేహాన్ని తగలబెట్టి.. నాలుగు బస్తాల్లో నింపి, కాలువలోకి విసిరేశాడు. ఆగస్టులో పాంధర్ కనిపించడం లేదని కంప్లైంట్ రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆమె హత్యకు గురైందని నిర్థారణ కావడంతో సోనును అరెస్ట్ చేశారు. ఆమె కెనడాలో ఒక పెళ్లికి వెళ్లిందని నమ్మించే ప్రయత్నం చేయగా.. ఫోరెన్సిక్ బృందం రూపిందర్ కౌర్ పాంధర్ బ్యాంక్ అకౌంట్ ద్వారా జరిగిన లావాదేవీలపై ఫోకస్ పెట్టారు. ఆమె పెళ్లాడాలనుకున్న చరణ్ జిత్ సింగ్ గ్రేవాల్ ను ఎఫ్ఐఆర్ లో ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. అతడిని భారత్ కు రప్పించి విచారణ చేస్తే.. నిజనిజాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.

Next Story